ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం
NEWS Jan 25,2026 01:01 pm
అనకాపల్లి జిల్లా రావికమతం మండలం మేడవాడ గ్రామ సమీపంలోని కొండపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి టి.అజ్జాపురం గ్రామానికి చెందిన ఎల్‌ఐసీ ఏజెంట్ రాజాన చిన్ననాయుడు రూ.1,00,116 విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ అభివృద్ధి పనులకు వినియోగించాలని కోరుతూ ధర్మకర్త కె.వి. రామనాయుడుకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి టిటిడి, ప్రజాప్రతినిధులు, దాతలు ముందుకు రావాలని గ్రామస్తులు కోరారు.