మాఘ మాసంలో వచ్చే ఆదివారం గ్రామదేవత పోచమ్మకు చలి బోనం సమర్పించడం ఉత్తర తెలంగాణ సాంప్రదాయం. రాత్రి వండిన బోనాన్ని ఉదయం తలపై ఎత్తుకొని పోచమ్మకు సమర్పిస్తారు. నిర్మల్ పట్టణంలోని మహిళలు ఉదయాన్నే అమ్మవారి ప్రత్యేక పూజలు చేసి బోనం సమర్పించారు. అనంతరం తమ కుటుంబ సభ్యులతో కలిసి బోనాన్ని ప్రసాదంగా స్వీకరించారు. పిల్లాపాపలతో సహా కుటుంబాన్ని చల్లగా చూడాలని అమ్మవారిని మొక్కుకున్నారు.