మేడారం జాతరలో భక్తుల భద్రత కోసం పటిష్ట ఏర్పాట్లు చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. తొలిసారిగా ‘చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’ క్యూఆర్ కోడ్ రిస్ట్‌బ్యాండ్లను ప్రవేశపెట్టామని చెప్పారు. వొడాఫోన్-ఐడియా సహకారంతో రూపొందించిన ఈ బ్యాండ్లతో తప్పిపోయిన పిల్లలు, దివ్యాంగుల వివరాలు వెంటనే గుర్తించవచ్చన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాల్లో 25 వేల రిస్ట్ బ్యాండ్లు అందుబాటులో ఉంచారు.