AP: తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 5:30 గంటల నుంచి మలయప్ప స్వామి ఉభయ దేవతలతో కలిసి మాడ వీధుల్లో సూర్యప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొని తరించారు. గోవిందా నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి.