గొనసపూడి సర్పంచు విక్రం దీప్తికి
గవర్నర్ 'ఎట్ హోం' ఆహ్వానం
NEWS Jan 24,2026 01:09 pm
రిపబ్లిక్ డే సందర్భంగా AP గవర్నర్ సమక్షంలో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక 'ఎట్ హోం' కార్యక్ర మానికి పర్చూరు నియోజకవర్గం గొనసపూడి గ్రామ సర్పంచ్ విక్రం దీప్తి నారాయణరావుకు ఆహ్వానం అందింది. గ్రామ సర్పంచుగా తనకు ఈ గౌరవం లభించడం ఆనందంగా ఉందని, ప్రజల సేవకు ఇది మరింత ప్రోత్సాహమని ఆమె అన్నారు. ఈ ఆహ్వానం గ్రామానికి గర్వకారణమని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.