ఖానాపూర్ పట్టణంలో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం జరిగింది. స్థానిక వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి షూటింగ్‌ను ప్రారంభించారు. తేజు బిల్లా దర్శకత్వంలో ఖానాపూర్ పరిసర ప్రాంతాల్లో 15 రోజులపాటు షూటింగ్ జరుపుకుంటుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డా. రమేష్ రెడ్డి క్లాప్ కొట్టగా, ఖానాపూర్ సిఐ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సినిమా చిత్రీకరణ చక్కగా జరగాలని విజయవంతం కావాలని పలువురు డైరెక్టర్ తేజకు అభినందనలు తెలిపారు.