అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంతో స్నేహబంధాన్ని బలోపేతం చేయాలని భావిస్తూ, రష్యా చమురుపై భారత్‌కు విధించిన సుంకాలను త్వరలో ఎత్తివేస్తామని సంకేతాలు ఇచ్చింది. భారత్–యూరప్ వాణిజ్య ఒప్పందం సమీపిస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. యూరప్–అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాణిజ్యం భారత్ వైపు మళ్లే అవకాశం ఉంది. దీనివల్ల భారత్‌కు 5 బిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.50 వేల కోట్ల లాభం చేకూరే అవకాశం ఉంది.