మేడారం జాతరకు ముందే లక్షలాది జనం
NEWS Jan 24,2026 04:14 pm
మేడారం మహా జాతరకు 5 రోజుల వ్యవధే ఉంది. ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు భారీగా మేడారం తరలి వస్తున్నారు. ప్రధాన కూడళ్లు, గద్దెలు, జంపన్నవాగు స్నాన ఘట్టాలు, తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు, ఆర్టీసీ బస్టాండ్, పార్కింగ్ స్థలాలు, విడిది చేస్తే అటవీ ప్రాంతాల్లో భక్తజనంతో రద్దీగా మారాయి. 3 లక్షల మందికి పైగా భక్తులు ప్రైవేటు, ఆర్టీసీ వాహనాల్లో తరలివచ్చారు. దీంతో రోడ్లపై వాహనాలు బారులు తీరాయి. సమ్మక్క, సారలమ్మలకు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన భక్తులతో మేడారం పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి.