550 గంటల్లో లక్ష పెరిగిన వెండి!
NEWS Jan 24,2026 03:38 pm
జనవరి 2026లో గత 550 గంటల్లో వెండి అనేక రికార్డులను సృష్టించింది. ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచిన ఒక తిరుగులేని రికార్డును కూడా సృష్టించింది. నిజానికి వెండి ధరలు కేవలం 550 గంటల్లో (23రోజులు) లక్ష రూపాయలకు పైగా పెరిగాయి. ఇది రికార్డు. జనవరి 24న హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3,60,100 వద్ద ఉండగా, అదే ఢిల్లీ, ముంబైలలో రూ.3,35,000 వద్ద ట్రేడవుతోంది.