బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ కు సీపీ సజ్జనార్ నోటీసులు పంపించారు. తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని, 2 రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని, 7 కేసులకు సంబంధించిన క్రైమ్ నంబర్లు, పోలీస్ స్టేషన్ వివరాలు ఇవ్వాలని, వివరాలు ఇవ్వకపోతే క్రిమినర్ చర్యలు తప్పవని సజ్జనార్ నోటీసుల్లో హెచ్చరించారు. అంతకు ముందు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సిట్ అధికారిగా సజ్జనార్ పై 7 కేసులు ఉన్నాయని.. అలాంటి వ్యక్తి సిట్ చీఫ్‌గా ఉండడం ఏంటని ప్రశ్నించారు. నిజానికి ఫోన్ ట్యాపింగ్ కేసును విచారించడానికి సీపీ సజ్జనార్, డీజీపీ శివధర్‌రెడ్డి లేదని ప్రవీణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.