చెలరేగిన సూర్య - భారత్ ఘన విజయం
NEWS Jan 23,2026 11:01 pm
రాయ్‌పుర్: రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. 209 పరుగుల లక్ష్యాన్ని 15.2 ఓవర్లలో ఛేదించింది. ఇషాన్ కిషన్ 76, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 82తో చెలరేగారు. 468 రోజుల తర్వాత సూర్య హాఫ్ సెంచరీ చేసినట్టయింది. చివర్లో శివమ్ దూబె 36తో మెరిపించాడు. భారత్ 5 టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. గువాహటిలో మూడో మ్యాచ్ జరగనుంది.