నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో సేవ
NEWS Jan 23,2026 11:04 pm
మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని 29వ వార్డు టీడీపీ అధ్యక్షుడు ఊరుకుటి గణేష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వృద్ధులు, వికలాంగులకు పండ్లు, చీరలు పంపిణీ చేసి అన్నసమారాధన చేశారు. విశాఖ కేజీహెచ్ ఆర్థోపెడిక్ వార్డులో 200 మందికి పండ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. యువగలం పాదయాత్రలో ప్రజల కష్టాలను లోకేష్ గుర్తించారని అన్నారు. కార్యక్రమంలో పల్లా శ్రీను, బంగారు రాజు, పల్లా చలపతి రావు పాల్గొన్నారు.