కళాధారలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
NEWS Jan 23,2026 10:07 pm
కథలాపూర్ మండల కేంద్రంలోని కళాధర హైస్కూల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేసి వేద పండితుల సాక్షిగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాధర చైర్మన్, జగిత్యాల జిల్లా రైతు నాయకులు గడ్డం భూమారెడ్డి మాట్లాడుతూ వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయడం శుభప్రదమన్నారు. సరస్వతీ పూజ అనంతరం కార్యక్రమం జరిగింది. ప్రధానోపాధ్యాయులు కమలాకర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.