రూ.80,000 చిలుక ఎగిరిపోయింది..!
NEWS Jan 23,2026 11:58 am
కాట్రేనికోనలో వస్త్ర వ్యాపారి బండారు దొరబాబుకు పక్షులంటే అపారమైన ప్రేమ. మూడేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి రూ.80 వేలకు కొనుగోలు చేసిన చిలుకను ‘చార్లీ’గా ప్రేమగా పెంచుకుంటున్నాడు. సంక్రాంతి రోజు పంజరం నుంచి బయటకు వచ్చిన చిలుక ఎగిరిపోయింది. గ్రామంలో ఒకరి ఇంటివద్ద వాలినట్లు తెలిసినా అప్పగించకపోవడంతో బాధితుడు కాట్రేనికోన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చిలుకతో పాటు డబ్బు కూడా పోయిందని వాపోతున్నాడు.