బాసరలో వసంత పంచమి వేడుకలు
NEWS Jan 23,2026 04:38 pm
వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాత్రి ఒంటి గంట నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచిచూస్తున్నారు. ఆలయ ప్రాంగణం, అక్షరాభ్యాస మండపం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. జాతర సందర్భంగా జిల్లా యంత్రాంగం అన్ని సౌకర్యాలు కల్పించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.