మేడారం జాతరకు స్పెషల్ ట్రైన్స్
NEWS Jan 23,2026 11:01 am
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం జనవరి 28, 29 తేదీల్లో 28 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. మేడారంకు నేరుగా రైల్వే లైన్ లేకపోవడంతో సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి వరంగల్, కాజీపేట వరకు ఈ రైళ్లు నడుస్తాయి. అక్కడి నుంచి భక్తులు సులువుగా చేరుకునేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచనున్నారు.