ఏడేళ్ల రికార్డు వేడికి బ్రేక్
NEWS Jan 23,2026 05:29 am
ఢిల్లీ: ఏడేళ్ల రికార్డు వేడికి బ్రేక్ పడింది. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిశాయి. పశ్చిమ కల్లోలం ప్రభావంతో వాతావరణం మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం 27.1 డిగ్రీలుగా ఉన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 18–20 డిగ్రీలకు పడిపోనుంది. వర్షాలతో గాలి నాణ్యత ‘వెరీ పూర్’ నుంచి మెరుగుపడే అవకాశం ఉంది.