బీఎస్పీ అభ్యర్థిగా కాల్వ ప్రవీణ్ కుమార్
NEWS Jan 23,2026 10:53 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఇంద్రానగర్ కాలనీ 6వ డివిజన్ కార్పొరేటర్గా కాల్వ ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన బరిలోకి దిగుతున్నారని తెలిపారు. ఈ ప్రత్యేక సమావేశంలో బీఎస్పీ తరఫున కాల్వ ప్రవీణ్ కుమార్‌కు బీ ఫారం ఇస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి తాండ్ర వెంకటేశ్వర్లు, పాల్వంచ పట్టణ అధ్యక్షులు ఎండి అబ్దుల్ అమీద్ ప్రకటించారు. కాల్వ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఇంద్రానగర్ కాలనీలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం పోరాడతానని తెలిపారు. ప్రజల సమస్యలే తన ప్రధాన అజెండా అని ఆయన స్పష్టం చేశారు.