ప్రతిపక్ష నేత (LOP) హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. సభలో ప్రభుత్వ అక్రమాలను ఎండగట్టాలంటే ప్రతిపక్ష హోదా అవసరమని అన్నారు. భూముల సమగ్ర రీసర్వేలో చంద్రబాబు ‘క్రెడిట్ చోరీ’ చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని విమర్శించారు. ఏడాది తర్వాత పాదయాత్ర చేపట్టి ప్రజల్లోనే ఉంటానని తెలిపారు. ఎమ్మెల్యేలు సభకు రాకపోవడంపై స్పీకర్ వ్యాఖ్యలకు కూడా జగన్ కౌంటర్ ఇచ్చారు.