పెద్దపూడిలో ఉచిత పశు వైద్య శిబిరం
NEWS Jan 22,2026 04:35 pm
పెద్దపూడి గ్రామంలో డాక్టర్ రాము బగాది ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో 41 పశువులకు సాధారణ చికిత్సలు, గర్భకోశ చికిత్సలు అందించగా, 499 గొర్రెలకు వ్యాధినిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు ఉచితంగా పంపిణీ చేశారు. పశువుల ఆరోగ్య పరిరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దపూడి గ్రామం గ్రామ పెద్దలు, రైతులు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.