భారత బ్యాడ్మింటన్‌లో ముగిసిన ఒక శకం
NEWS Jan 20,2026 07:40 pm
భారత బ్యాడ్మింటన్ దిగ్గజ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ తన అద్భుతమైన కెరీర్‌కు ముగింపు పలికింది. రెండేళ్లుగా తీవ్రమైన మోకాలి నొప్పితో ఆటకు దూరంగా ఉన్న ఆమె, తన శరీరం ఇక ఉన్నత స్థాయి పోటీలకు సహకరించడం లేదని, ప్రొఫెషనల్‌గా ఆడలేనని స్పష్టం చేసింది. రిటైర్మెంట్ గురించి ప్రత్యేకంగా ప్రకటించాల్సిన అవసరం లేదనుకుంటున్నానని సైనా పేర్కొంది. ప్రత్యేకంగా రిటైర్మెంట్ ప్రకటన చేయకపోయినా, సైనా మాటలతో భారత బ్యాడ్మింటన్‌లో ఒక స్వర్ణయుగం ముగిసినట్లయింది.