వసంత పంచమి వేడుకలకు బాసరలో భారీ బందోబస్తు
NEWS Jan 20,2026 07:44 pm
బాసరలో జనవరి 23న జరగనున్న వసంత పంచమి వేడుకలను పురస్కరించుకొని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆలయ పరిసరాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా బారికేడింగ్, ప్రత్యేక క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. వృద్ధులు, మహిళలు, పిల్లలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయ ఈఓతో క్యూ లైన్ల నిర్వహణ, లడ్డు కౌంటర్ల వద్ద రద్దీ నియంత్రణపై చర్చించారు.