గ్రామ సమస్యలపై ముక్కా సాయివికాస్ రెడ్డి స్పందన
NEWS Jan 20,2026 03:10 pm
రైల్వే కోడూరు నియోజకవర్గంలోని రాఘవరాజుపురం, ఆర్.రాచపల్లి గ్రామాల్లో యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై, వీధిలైట్లు, వాటర్ ప్లాంట్, పంచాయతీ భవనం, రోడ్లు, విద్యుత్ సమస్యలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రత్యేకంగా వీధిలైట్ల సమస్యపై ఆయన వెంటనే స్పందించి అక్కడికక్కడే లైట్లు అందజేయడం స్థానికులను ఆకట్టుకుంది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను కేవలం విన్నదాకా కాకుండా, అధికారులతో సమన్వయం చేస్తూ పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారని గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు. ప్రజల మధ్య నుంచే పాలన సాగిస్తూ, గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నాయకుడిగా ముక్కా సాయి వికాస్ రెడ్డి నిలుస్తున్నారని స్థానికులు అభిప్రాయపడ్డారు.