ఒక్కసారిగా పెరిగిన పసిడి, వెండి ధరలు!
NEWS Jan 20,2026 01:11 pm
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల దెబ్బకు పసిడి, వెండి రేట్స్ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. సోమవారం భారీగా పెరిగిన ధరలు మంగళవారం కూడా ర్యాలీని కొనసాగించాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు మధ్యాహ్నం 12.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1040 మేర పెరిగి రూ.1,47,280ల రికార్డు స్థాయికి చేరింది. 22 క్యారెట్‌ల ఆర్నమెంటల్ బంగారం ధర కూడా రూ.1,35,000కు ఎగబాకింది. వెండి ధర ఒక్కరోజులో ఏకంగా రూ. 12 వేల మేర పెరిగి రూ.3,30,000కు చేరుకుంది.