బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్రరావు సస్పెండ్ అయ్యారు. మహిళలతో అత్యంత సన్నిహితంగా మెలిగిన పలు వీడియోలు సోషల్ మీడియాలో పలు అసభ్యకరమైన వీడియోలు వైరల్ కావడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. రామచంద్ర తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు, తనను ఇరికించారని ఆరోపించారు. బంగారం అక్రమ రవాణా కేసులో మార్చి 2025లో అరెస్టయిన జైలు శిక్ష అనుభవిస్తున్న రన్యారావుకు ఆయన సవతి తండ్రి. తన తండ్రి స్థానాన్ని ఆసరాగా చేసుకుని ప్రోటోకాల్‌ను దుర్వినియోగం చేసిందని రన్యాపై ఆరోపణలు ఉన్నాయి.