నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బస్ డిపో సమీపంలో రాత్రి 1 గంట ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కుబీర్ మండలానికి చెందిన వారు కారులో హైదరాబాద్ నుంచి తిరిగి వస్తుండగా కంటైనర్ ను ఢీకొంది. మృతులు కుప్తి గ్రామానికి చెందిన బాబన్న, భోజరాం పటేల్, రాజన్న, వికాస్ గా గుర్తించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.