నిర్మల్ ఉత్సవాల కార్యక్రమ ప్రారంభోత్సవానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రికి గుస్సాడి నృత్యాలతో స్వాగతం పలికారు. మంత్రితో కలిసి డిసిసి అధ్యక్షులు వెడ్మ బజ్జు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిర్మల్ ఉత్సవాల పేరిట గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నారని కితాబిచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ రకాలైన స్టాల్స్ ఇన్నోవేటివ్, ఇన్ఫర్మేషన్ గా చక్కగా ఉన్నాయన్నారు. నిర్మల్ ఉత్సవాలను నిర్వహిస్తున్న అధికారులను అభినందించారు.