విద్యార్థులకు పెన్నులు ప్యాడ్స్ పంపిణీ
NEWS Jan 20,2026 12:48 am
కథలాపూర్: సిరికొండ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బిజెపి మండల అధ్యక్షులు మల్యాల మారుతి 10వ తరగతి విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ విద్యార్థులు 10వ తరగతి ఎంతో ప్రాముఖ్యత ఉందని, పరీక్షలలో ఎక్కువ మార్కులు సాధించి గ్రామానికి వన్నె తీసుకురావాలని, 100% ఉత్తీర్ణత సాధించాలని కోరారు. బిజెపి కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపల్లి గోపాల్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు శ్రీనివాస్, కాసోజు ప్రతాప్, రవి, వెంకటేష్, ఎంఈఓ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు రవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.