ప్రధాని మోదీ బయోపిక్‌ను ‘మా వందే’ అనే టైటిల్‌తో రూపొందిస్తున్నారు. మోదీ పాత్రలో మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. క్రాంతికుమార్ డైరెక్ట్ చేస్తుండగా సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై వీర్ రెడ్డి రూ.400 కోట్లతో నిర్మిస్తున్నారు. ‘ఆక్వామెన్’ ఫేమ్ జేసన్ మమోవాను ఓ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు మూవీ టీమ్ పేర్కొంది. JAN 22 నుంచి కశ్మీర్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది.