డాగ్స్ సంరక్షణపై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో జరిగిన గందరగోళంపై రేణు దేశాయ్ స్పష్టత ఇచ్చారు. తాను మీడియాపై కోప్పడలేదని, తప్పుదారి పట్టించే థంబ్‌నెయిల్స్, రూమర్స్ ఆపాలని కోరారు. ప్రెస్ మీట్‌లో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అరిచి దాడికి యత్నించడంతోనే తాను స్పందించాల్సి వచ్చిందన్నారు. రాజకీయాల్లోకి రావడం లేదని, ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదని, తన ఎన్‌జీఓ ద్వారా సామాజిక సేవలతో సంతోషంగా ఉన్నానని తెలిపారు. వ్యక్తిగత జీవితంపై నీచ వ్యాఖ్యలు చేయొద్దని, పిల్లల ప్రాణాలపై మాట్లాడటం తప్పని హెచ్చరించారు.