రోడ్ సేఫ్టీ తమ ప్రయారిటీ అని మెట్ పల్లి పోలీసులు స్పష్టం చేశారు. అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా సేఫ్ జర్నీ-సేవ్ లైఫ్ అనే నినాదంతో వాహనదారులకు ఎస్సై కిరణ్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఏటా రోడ్డు ప్రమాదాల్లో ఎందరో కుటుంబ పెద్దలను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, డ్రైవింగ్లో నిర్లక్ష్యం మానుకొని హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా వాడాలని ఎస్సై కిరణ్ సూచించారు.