పెద్దపల్లి: మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తిలక్‌నగర్ కాలనీలో పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా మారాయి. కాలువల్లో మురుగు నీరు నిలిచిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఈ విషయమై ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడంపై కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకుని సమస్య పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.