లోపూడి రెవిన్యూ పరిధిలోని బంగారు మెట్ట గ్రామంలో నేడు రీ–సర్వే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన రైతులందరూ విస్తృతంగా పాల్గొన్నారు. భూ సరిహద్దులు, విస్తీర్ణం, రికార్డులలో ఉన్న తేడాలను సరిచూడడం కోసం రీ–సర్వే చేపట్టారు. సర్వేయర్ సాయి ఆధ్వర్యంలో కొలతలు చేపట్టగా, రైతులకు వివరాలు స్పష్టంగా తెలియజేశారు. రీ–సర్వేతో భూ సమస్యలు పరిష్కారమవుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.