స్టెర్లింగ్(వర్జీనియా): టాలీవుడ్ నిర్మాత నాగేశ్వర రావు పూజారితో ATA ఆధ్వర్యంలో మీట్ & గ్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. డీఎంవీ ప్రాంత తెలుగు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జీవన ప్రయాణం, సినీ అనుభవాలపై ఆయన మాట్లాడగా, ప్రశ్నోత్తరాలు యువతను ఆకట్టుకు న్నాయి. ATA అధ్యక్షులు జయంత్ చల్లా ATA లక్ష్యాలను వివరించారు. జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్‌లో జరిగే 19వ ATA కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.