తెలంగాణ కుంభమేళా సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ముందే మేడారానికి భక్తులు పోటెత్తారు. మేడారం జాతరకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీంతో వనదేవతల గద్దెల ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మేడారం పరిసరాలు విద్యుత్ దీప కాంతుల్లో మెరిసిపోతోంది.