బైంసా పట్టణంలోని ఇండియన్ నేవీ & ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ ఫలితాల్లో ముధోల్ తాలూకా వ్యాప్తంగా ఎంపికైన 15 మంది విద్యార్థులను ఎమ్మెల్యే రామారావు పటేల్ సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ భవిష్యత్తు విద్యార్థులు, యువత చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. చిన్న వయసులోనే దేశ రక్షణలో భాగస్వాములవుతున్న ముధోల్ నియోజకవర్గ ముద్దుబిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువతరంగ్ సంస్థ డైరెక్టర్లు నవీన్ కుమార్, గంగాప్రసాద్, సాగర్ గౌడ్, సత్తన్న పాల్గొన్నారు.