ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి ఆర్నిస్ పోటీల్లో నిర్మల్ జిల్లా సుంక్లి గ్రామానికి చెందిన కర్కెల్లి దివ్య సిల్వర్ మెడల్ సాధించి సత్తా చాటారు. ఈ విజయంతో ఆమె వచ్చే నెల జమ్మూ కాశ్మీర్లో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించారు. తెలంగాణ నుంచి ఈ పోటీల్లో ఖానాపూర్‌కు చెందిన నాగలక్ష్మి గోల్డ్ మెడల్ గెలుచుకోగా, దివ్య సిల్వర్ మెడల్ సాధించారు. గ్రామానికి తిరిగివచ్చిన దివ్యను గ్రామ సర్పంచ్ ఆదిరత్న శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా దివ్య గతంలో బాక్సింగ్ పోటీల్లోనూ పలు మెడల్స్ సాధించిందని పేర్కొంటూ, అంతర్జాతీయ వేదికపై ప్రతిభ చూపి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.