తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. మేడారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 18 అంశాలపై చర్చించారు. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి, మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.