రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు నిట్టూరు విద్యార్థులు
NEWS Jan 18,2026 05:34 pm
నవంబర్ 10 నుంచి 20 వరకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో, అలాగే 10 నుంచి 18 ఏళ్ల బాలికలు కటారం కేంద్రంలో శిక్షణ పొందారు. ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సబ్ జూనియర్స్ ఖో ఖో ఎంపికల్లో అట్ల మాలిని, బాలసాని సిరి, బండి సంజయ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారు. వీరు మహబూబ్‌నగర్‌లో 18 నుంచి 20 తేదీల మధ్య జరిగే రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నిట్టూరు ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య, పీఈటీ పిట్ట భాస్కర్, సీఆర్పీ కుంబాల సుధాకర్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు క్రీడాకారులను అభినందించారు.