పెద్దపల్లి పట్టణానికి చెందిన శ్రీమాత డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ చైర్మన్ కాసర్ల రాజు తన పెంపుడు శునకం భైరవ ఆరోగ్యం కుదుటపడాలని సమ్మక్క సారక్క అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కు తీర్చుకున్నాడు.
గత నెల తీవ్ర అనారోగ్యానికి గురైన భైరవకు ఆరోగ్యం మెరుగుపడితే జాతరలో ఎత్తు బంగారం సమర్పిస్తానని మొక్కుకోగా, కుక్క పూర్తిగా కోలుకోవడంతో మొక్కు నెరవేర్చినట్లు రాజు తెలిపారు. మూగ జీవాల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు.