మల్యాల మండలం తాటిపల్లి గురుకులంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాస హారిక అనే విద్యార్థిని ఈనెల 19 నుంచి 23 వరకు హిమాచల్ ప్రదేశ్ లో జరిగే అండర్-19 కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ మానస, పీఈటి మధులిక తెలిపారు. హారిక ఇప్పటివరకు 8సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొందని, గత అక్టోబర్ నెలలో మహబూబాబాద్ లో జరిగిన పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచినందుకుగాను రాష్ట్ర కబడ్డీ జట్టుకు ఎంపికైందని ప్రిన్సిపల్ అన్నారు. ఈ సందర్భంగా హారికను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.