ఆదిలాబాద్‌లో నిర్వహించిన 11వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లో జగిత్యాల జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. 8 ఏళ్ల విభాగం 60 మీటర్ల పరుగు పందెంలో కొత్త శ్రీయన్ (కోరుట్ల), స్టాండింగ్ లాంగ్ జంప్‌లో డేవిడ్ ఆయిస్టిన్ పాల్ (పోరుమళ్ళ) ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించారు. వీరిని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి, ఉపాధ్యక్షులు గజేల్లి రాందాస్, కొమురయ్య, అంజయ్య, కార్తీక్ అభినందించారు.రాష్ట్ర స్థాయిలో రాణించడం జిల్లాకే గర్వకారణమన్నారు.