కథలాపూర్ మండల కేంద్రంలో ప్యాక్స్ (PACS) సొసైటీని ఏర్పాటు చేయాలని మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. కథలాపూర్ మండలంలో ఆయన మాట్లాడుతూ.. ప్యాక్స్ సొసైటీ ఏర్పాటు చేస్తే మండల అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. ఈ అంశంపై మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబుకు, ప్రస్తుత ఎమ్మెల్యేకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్యాక్స్ సొసైటీని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, లేకపోతే రానున్న కాలంలో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటామని హెచ్చరించారు.