నిర్మల్ జిల్లా: సారంగాపూర్ మండలం ఆలూరు వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితుడి తలకు తీవ్ర గాయాలవ్వగా, స్థానికులు 108కు సమాచారం అందించారు. సిబ్బంది పైలట్ రమేశ్, EMT రాజు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.