CM రేవంత్ రెడ్డి మీడియా సంస్థలపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. తమ మంత్రుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వార్తలు రాయవద్దని, మీడియా సంస్థల మధ్య ఏవైనా గొడవలుంటే తలుపులు మూసుకుని కొట్టుకోండి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాసేముందు నన్ను వివరణ అడగండి, మా మంత్రులను బద్నాం చేయొద్దు. వారిపై వార్తలు వస్తే నా గౌరవానికి భంగం కలుగుతుంది\" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు మీడియా సంస్థల మధ్య వివాదం నడుస్తోందన్న ప్రచారం నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.