పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాలు
NEWS Jan 18,2026 04:55 pm
పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 31 వరకు అన్ని గ్రామపంచాయతీలలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారు. పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లకు ఉచిత టీకాలు, వ్యాధి నిర్ధారణ, పశు యాజమాన్యంపై అవగాహన కల్పిస్తారు. 85 శాతం రాయితీతో నూతన పశు బీమా పథకం అమలు చేయనున్నారు. డా. రాము బగాది, డా. పద్మజ పర్యవేక్షణలో శిబిరాలు జరుగుతాయి.