చిరంజీవి బాక్సాఫీస్ స్టామినాను నిరూపిస్తూ ‘మన శంకర వరప్రసాద్ గారు (MSG)’ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 261 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నార్త్ అమెరికాలో $2.62 మిలియన్ల వసూళ్లతో చిరంజీవి కెరీర్ బెస్ట్ రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం, త్వరలోనే $3 మిలియన్ల మార్క్‌ను దాటనుంది. 6 రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని, 2026 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.