నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో భూ కబ్జాకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన సర్వే నంబర్ 28/7, 28/8 లోని 2.20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక వ్యక్తి నకిలీ పత్రాలతో కబ్జా చేశారని వారు ఆరోపిస్తున్నారు. గ్రామ అవసరాల కోసం కేటాయించిన ఈ భూమిని కాపాడాలని కోరుతూ ప్రధాన కూడలి వద్ద బైఠాయించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, న్యాయం జరగకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.