నిర్మల్ మండలంలోని కొండాపూర్ గ్రామం నుంచి అక్కాపూర్, ముఠాపూర్ వెళ్లే రహదారి తీవ్రంగా దెబ్బతింది. సుమారు 2 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డుపై కంకర తేలి గుంతలమయంగా మారడంతో ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి రోడ్డును మరమ్మతు చేయాలని ప్రయాణికులు కోరారు.