సంక్రాంతి పండుగ సందర్భంగా ఖానాపూర్ MLA వెడ్మ బొజ్జు స్వగృహంలో సంబరాలు నిర్వహించారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో సంక్రాంతి సందర్భంగా బసవన్నలకు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు . ప్రతి సంక్రాంతికి ఇంటింట తిరుగుతూ ప్రజలను ఆశీర్వదిస్తూ, 2 రాష్ట్రాల్లోని ప్రజలు సంక్రాంతికి బసవన్నలను పూజించడం ఆనవాయితీగా వస్తుంది అని, రాబోయే తరాలు సంస్కృతి, సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు .